యాంకర్: ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ సమస్యను పరిష్కరించి 6 నెలలు కాలంలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా ఆన్నారు.
వాయిస్: గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట పుష్కరకాలువపై సిఎస్అర్ నిధులు రూ.48 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ తో పాటు, ఎంపి వంగా గీత ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సంధర్భంగా మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తయిన బ్రిడ్జి బిసి కాలనీ వాసులకు ఉపయోగపడుతుందన్నారు. ఎంపి గీతా మాట్లాడుతూ కాలవ ఏర్పాటుతో నీలాద్రిరావుపేట నుండి బిసి కాలనీకి భారీ వాహనాలు రాకపోకలు నిలిచిపోయయన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో రాకపోకలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని పనిని జగన్ ప్రభుత్వం చేపట్టిందని అందుకు నిదర్శనం ఈ బ్రిడ్జి నిర్మాణమే అన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమన్నారు. అనంతరం నీలాద్రి రావుపేటలో నిర్మించిన సచివాలయం.2 కార్యాలయాన్ని ఎంపీ గీత, జిల్లా కలెక్టర్, కన్నబాబు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో , సర్పంచ్ సురేష్ బాబు ఎంపీపీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు అధికారులు, పాల్గొన్నారు.