Top Tag

22 నుంచి కళా సమ్మేళనం
– 14 గంటల పాటు నృత్య ప్రదర్శన
– 5 వరల్డ్‌ రికార్డులు రూపకల్పన కోసం ప్రయత్నం
– మీడియా సమావేశంలో నిర్వాహకులు జీబీ నారాయణ
రాజమహేంద్రవరం :
స్థానిక ఆనం కళా కేంద్రంలో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు కళా సమ్మేళనం పేరిట గొప్ప నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వాహకులు జీబీ నారాయణ తెలిపారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడిరచారు. రాజమహేద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ శ్రీ రాధాకృష్ణ ట్రస్ట్‌, శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర సంయుక్త ఆధ్వర్యంలో మ్యూజిక్‌ అండ్‌ డాన్స్‌ ఫెస్ట్‌`2023 పేరిట ఈ నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రూబే 40 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా 22వ తేదీ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ 5 వరల్డ్‌ రికార్డులు రూప కల్పన కోసం 14 గంటల 2 నిమిషాల 2 సెకండ్ల పాటు శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రకు చెందిన 101 మంది విద్యార్ధులతో 101 సార్లు హనుమాన్‌ చాలీసా నృత్య ప్రదర్శన ఉంటుందన్నారు. ఒకే వేదిక నుంచి వైదిక సిద్ధాంతంలో ప్రత్యక్ష కళ్యాణం జరుగుతుండగా లలిత, జానపద పెళ్ళి పాటలకు నృత్య ప్రదర్శన చేయడం ద్వారా సరికొత్త సద్ధాంతాన్ని పరిచయం చేసే ప్రయత్నం తాము చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జాతీయ స్థాయి సంగీత, నృత్య పోటీలు, సాయంత్రం 6 గంటల నుంచి శ్రీనివాస కళ్యాణం ఉంటాయన్నారు. 24వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జాతీయ స్థాయి సంగీత, నృత్య పోటీలు ఉంటాయన్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి చెరుకుమిల్లి సిరి చందన కూచిపూడి అరంగేట్రం ఉంటుందన్నారు. 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జాతీయ స్థాయి సంగీత, నృత్య పోటీలు నిర్వహిస్తుండగా సాయంత్రం 4 గంటల నుంచి సంగీత నాట్య శాస్త్రాలపై ప్రముఖులతో చర్చా వేదిక, సాయంత్రం 6 గంటల నుంచి బహుమతి ప్రధానం నిర్వహిస్తున్నట్టు వివరించారు. డాక్టర్‌ కుషల్‌ భట్టాచార్య (కోల్‌కత్తా), పోతిన శ్రీనివాస్‌ (హైదరాబాద్‌), గోరుగంతు ఉమాజయశ్రీ (రాజమహేంద్రవరం), తిరుపతి ఎస్వీ కళాశాల లెక్చరర్‌ తిరుపతి యాళ్ళ శ్రీవాణి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఆయా కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్‌ కె మాధవిలత, రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్‌ కె దినేష్‌ కుమార్‌ ముఖ్య అతిధులుగా హాజరవుతారని తెలిపారు. అలాగే శైవక్షేత్ర శివస్వామి (గుంటూరు), కాకినాడ సెట్రాజ్‌ సీఈఓ షేక్‌ ఇమ్రాన్‌, కూచిపూడి కళాకారిణి, పద్మశ్రీ శోభా నాయుడి శిష్యురాలు యశోధ ఠాకుర్‌ కూడా హాజరుకానున్నారని నారాయణ తెలిపారు.

The Pulse of Washington D.C.

You may also like

© 21st Century Rich TVX America News