యువత సమస్యల ఉద్యమం
యువత మేలుకో.. సమస్యలను జయించి భవిష్యత్ నిర్మించుకో..
రాజమహేంద్రవరం : మన దేశానికి వెన్నుముక అయిన యువత వారి జీవితాలలో ఎన్నో ప్రణాళికలు మరియు లక్ష్యాలు కలిగి ఉన్నప్పటికీ వ్యసనాలకు లోనవ్వడం మరియు సమయపాలన పట్ల సరియైన అవగాహన కలిగిలేకపోవడంతోఎన్నోఇబ్బందులుకు లోనవుతున్నారు.ముఖ్యంగా మద్యం,మత్తుపదార్దాలు,అశ్లీలం,మొబైల్ గేమింగ్ మొదలైన వ్యసనాలకు బానిసలవ్వడంతో మానసిక ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాకుండా తమ లక్ష్యాలని చేరుకోలేని పరిస్థితి.దేశ పురోగాభివృద్ధి యువతతోనే సాధ్యం అలాంటి యువతే అనైతికత మరియు మానసిక ఒత్తిడికి లోనైతే వారి వ్యక్తిగత జీవితంతో పాటుగా కుటుంబం మరియు సమాజంపై కూడా దాని ప్రభావం పడుతుంది. ఈలాంటి ప్రభావాలు కలిగిన యువత తమ సమస్యలను గ్రహించి వాటి నుండి బయటపడే మార్గాలను గ్రహించి వాటిని అనుసరించి ఉత్తమమైన భవిష్యత్ నిర్మించుకోవాలి. కనుక “యువత మేలుకో.! సమస్యలను జయించి భవిష్యత్ నిర్మించుకో”..! అనే నినాదంతో యువకుల సమస్యల ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 16 నుండి 25 వరకు స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ వారు నిర్వహించి ఈ ఉద్యమం ద్వారా వీలైనంత వరకు యువత సమస్యలు వాటి పరిష్కరాలు కు ప్రాధాన్యత కల్పించడం జరిగింది.దేశభవిష్యత్తు యువత చేతిలోనే ఉంది, యువత నడుము భిగిస్తేనే దేశం పురోగభివృద్ధి సాధ్యమవుతుంది.లాంటివి విన్నప్పుడు నిజంగానా ! అనిపిస్తుంది. నిజమే, కానీ ఆ యువతకు తమ కష్టాలకు, సమస్యలకు పరిష్కారం చూపి ,దిశానిర్దేశం చేయడం ద్వారా అవుతుంది మరి అటువంటిది ఏమైనా జరుగుతుందా !
ప్రజాసంఘాల సర్వే ప్రకారం ప్రస్తుత యువతలో 50% మంది 25 సంవత్సరాల లోపు, 40%మంది 16-30 మధ్యవయస్కులు ఉన్నారు
అలాగే భారత యువతను చదువుకొన్నవారిగా, మరియు చదువుకోనివారిగా వర్గీకరిస్తే వారు ఎదుర్కొనే సమస్యలను అర్ధం చేసుకోవచ్చు. ఒకప్రక్క ఉద్యోగాలు లేక, పోటీ పరిస్థితులు పెరిగి, ఉన్నత చదువులు చదవలేక చదివనా ఉపాధి అవకాశాలు సన్నగిల్లి,మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ,మరో పక్క చదువుకోనివారు సైతం మద్యం, మత్తు పదార్ధాలకు లోనయ్యి, బాల నెరస్థులుగా పేదరికాన్ని అనుభవిస్తూ,అతి తక్కువ అభివృద్ధి కే నోచుకుంటున్నారు అనడం లో ఏమాత్రం సందేహం లేదు.
చదువుకున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా, చదువుకోని వారికి వారి స్థాయికి తగ్గట్టు అభివృద్ధికి నోచుకొనేల మద్యం మత్తుపదార్ధాలకు దూరంగా ఉండి మానసిక ఆందోళన లపై అవగాహనా కల్పిస్తూ వాటికి కొన్ని పరిష్కార మార్గాలను వారికీ చేరువయ్యేలా మరియు అవకాశాలను అంది పుచ్చుకుని దేశాభివృద్ధి లో భాగం అయ్యేలా SIO “ యువత సమస్యలు “ ఉద్యమం ద్వారా కృషి చేసేందుకు ఈ ఉద్యమ ప్రణాళిక ను సిద్ధంచేయడం జరిగినది అని జాతీయ ప్రధాన కార్యదర్శి సల్మాన్ ఖాన్, మరియు పౌర సంభందల కార్యదర్శి జీయావుర్ రెహ్మాన్ తెలిపారు..ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్ర అధ్యక్షులు రోషన్ జమీర్ ఖాన్, సంస్థగత కార్యదర్శి అబ్దుల్ అలీమ్, one కార్యదర్సులు, సలహామండలి సభ్యులు, సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.