నేటి యువతలో మార్పును కోరుతున్న : GIO
గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో జులై 14 నుండి 23 వరకు నిర్వహిస్తున్న *చేంజ్ : బిఫోర్ లైఫ్ ఎండ్స్ “CHANGE (Before Life Ends)* అనే 10 రోజుల ఉద్యమం నిర్వహించడం జరుగుతుంది . ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుత సమాజంలో మరియు యువతులలో నైతికత పెంపొందించడం, అశ్లీలం, అత్యాచారాలు, ర్యాగింగ్, వరకట్నం, స్త్రీ అగౌరవం, మహిళల పై వేధింపులు, ఇలాంటి అనేక చెడుల నుండి ప్రతి ఒక్కరిని దైవభీతి మరియు జవాబుదారీతనంతో నిండిన వ్యక్తిత్వాన్ని అలవర్చుకునే విధంగా జీవితం అంతంకాక ముందే మార్పు చెందేలా కృషి చేయటమే ఈ ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యం. ఉత్తమ సమాజ నిర్మాణం కేవలం యువతతోనే సాధ్యం, యువత దేశానికీ వెన్నెముక, కావున యువత గళంతోనే “మార్పు” సాధ్యం అనే ఈ ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలోJIH మహిళా విభాగం నగర అధ్యక్షురాలు హబీబా గారు, GIO రాజమండ్రి అధ్యక్షురాలు నస్రీన్, నఫీస్, సుమయ్యా, సనా, రాబియా, అన్జుం, తదితరులు పాల్గొన్నారు.